ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2017 (18:07 IST)

టిఫిన్ బయట తినేస్తున్నారా? ఆపండి బాబూ?

టిఫినే కదా.. ఇంట్లో చేసుకోవడం కంటే.. బయట తినేస్తే సరిపోతుందిలే అనుకుంటారు చాలామంది. అయితే అల్పాహారం బయట తీసుకోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

టిఫినే కదా.. ఇంట్లో చేసుకోవడం కంటే.. బయట తినేస్తే సరిపోతుందిలే అనుకుంటారు చాలామంది. అయితే అల్పాహారం బయట తీసుకోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అల్పాహారంలో పోషకాలుండాలని.. అలా కాకుండా బయట నాణ్యత లోపించే ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. బయట తినే ఆహారంలో ఉప్పు, నూనెల మోతాదు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
తాజా పండ్లు, సోయాపాలు, కాయగూరలతో చేసిన ఎగ్ ఆమ్లెట్, బాదం, ఆక్రోట్ వంటివి అల్పాహారంలో తీసుకుంటే శరీరానికి పోషకాలు అందించిన వారవుతారు. పెరుగును సలాడ్స్‌లో చేర్చుకోవచ్చు. ఉదయం పూట తీసుకునే ఆహారంలో పీచు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకోసం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన బ్రెడ్‌లు, అటుకులు, ఓట్‌మీల్‌ వంటివి చక్కని ప్రత్యామ్నాయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.