శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2017 (15:20 IST)

ఖర్జూరాలను రోజూ తింటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయట...

ఖర్జూరాలను రోజు రెండేసి తీసుకుంటే బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మెగ్నిషియం, కాపర్ వంటి మూలకాలతోపాటు ఖర్జూర పండ్లలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. తద్వారా పొట్టనిండినట్లు అనిపిస్తుంది.

ఖర్జూరాలను రోజు రెండేసి తీసుకుంటే బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మెగ్నిషియం, కాపర్ వంటి మూలకాలతోపాటు ఖర్జూర పండ్లలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. తద్వారా పొట్టనిండినట్లు అనిపిస్తుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోలేరు. తద్వారా బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
ఖర్జూరాలను రోజూ తీసుకుంటే జీర్ణక్రియ, జీవక్రియ మెరుగవుతుంది. ఖ‌ర్జూరాలు శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. కొవ్వులు, ట్రాన్స్‌ఫ్యాట్‌లు వీటిలో ఉండవు. ఇవి గుండెను ఆరోగ్యకరంగా వుంచుతాయి. ఖర్జూరాలను నిత్యం తీసుకుంటే ఎముకలు బలపడతాయి. 
 
వీటిలో వుండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలను తొలగించుకోవచ్చు. గొంతునొప్పి, మంట, జలుబుకు ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే కర్జూరపండు తరచుగా తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.