Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

Written By బిబిసి
Updated: గురువారం, 25 ఆగస్టు 2022 (17:08 IST)
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను హైదరాబాద్ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఈసారి తాజా వీడియోకు సంబంధించి కాకుండా ఒక పాత కేసులో అరెస్టు చేశారు. అయితే, ఆ కేసు కూడా మత విశ్వాసాలను భంగపరచడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనే సెక్షన్లకు సంబంధించినదే. గతంలో నమోదైన కేసులో భాగంగా సీఆర్పీసీ సెక్షన్ 41 నిబంధనలు పక్కాగా పాటిస్తూ ఈ అరెస్టు చేశారు పోలీసులు. రాజా సింగ్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు నిమిషాల వ్యవధిలో అరెస్టు పూర్తి చేశారు. ఆయనను సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో రిమాండ్ పిటిషన్ వేస్తారు.

 
రాజాసింగ్ వీడియో విడుదల చేసిన తరువాత పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే కోర్టు ఆయనను రిమాండుకు పంపకుండా బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచీ హైదరాబాద్ పాత బస్తీలో ఆందోళనలు, నిరసనలూ జరుగుతూనే ఉన్నాయి. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ యువత రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు.

 
శుక్రవారం మక్కా మసీదు ప్రార్థనల తరువాత ఎటువంటి ఆందోళనలూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యల కింద పెద్ద సంఖ్యలో అరెస్టులు చేశారు హైదరాబాద్ పోలీసులు. అటు ముస్లిం యువతతో పాటూ, ఇటు రాజా సింగ్‌ను అరెస్టు చేయడం ద్వారా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు పెరగకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అన్నీ చూడండి

దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్ నుంచి ఎవరే నువ్వే గీతం విడుదల

Shyam Prasad Reddy: అగధ లో కామాక్షి ని చూస్తే అరుంధతి లో అనుష్క ను గుర్తుచేసింది : శ్యాం ప్రసాద్ రెడ్డి

రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ పై మాయలేడి చెంగు చెంగున దూకెరా.. సాంగ్

జ్యోతి పూర్వజ్ కిల్లర్ చిత్రం తెలుగు, తమిళ సహా పలు దేశాల్లో విడుదల.

Manchu Manoj :ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు : గజ టీజర్ లాంచ్ లో మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments