Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పాలు, ఉప్పుతో చేతులు మృదువుగా.. ఎలా..?

Updated: సోమవారం, 12 నవంబరు 2018 (16:28 IST)
సాధారణంగా చాలామంది మహిళలు రకరకాల క్రీములు వాడి ముఖాన్ని పాడుచేసుకుంటున్నారు. ఈ క్రీమ్స్‌లోని రసాయనాలు చర్మాన్ని ముడతలుగా మార్చుతాయి. దాంతో చిన్న వయసు గలవారు కూడా ముడతల చర్మానికి గురౌతారు. మరి అందుకు ఏం చేయాలో చూద్దాం... పాలు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయనే విషయం అందరికి తెలిసిందే. మరి అందానికి ఎలా..
 
పాలను చర్మంపై పూర్తిగా రాయాలి. గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. అలానే చర్మం ఎంత అందంగా ఉంటుందో గోర్లు కూడా అంతే అందంగా ఉండాలి. కాబట్టి పాలలో దూదిని గోర్లను శుభ్రం చేయాలి. తద్వారా గోర్లు అందంగా పటిష్టంగా ఉంటాయి. ఎక్కువగా పాత్రలు తోమే చేతులు గరుకుగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో చేతులు మృదువుగా మార్చాలంటే.. ఏం చేయాలి?
 
పాలలో కొద్దిగా నిమ్మరసం కలిపి చేతులపై పూతలా వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే చేతులు మృదువుగా మారుతాయి. అలానే కొందరికి పెదాలు నల్లగా ఉంటాయి. వాటిని గులాబీ రంగులే తేవాలంటే.. రోజూ పెదాలను పాలు రాసుకోండి.. మంచి ఉపశమనం లభిస్తుంది. మెుటిమలు చర్మం వలన ముఖంపై నల్ల నల్లగా మచ్చలు వస్తుంటాయి. వాటిని తొలగించాలంటే.. ఇలా చేయాలి...
 
పాలలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. లేదా పాలలో కొద్దిగా ఉప్పు కలిపి రోజూ ఉదయం, సాయంత్రం ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మం కోమలంగా, తాజాగా మారుతుంది. అంతేకాకుండా బాదం పప్పులు, క్యారెట్ రసం, పాలు కలిపి జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే మెుటిమలు పోతాయి. దాంతో చర్మం సౌందర్యంతో ఇనుమడిస్తుంది. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments