బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (13:26 IST)

కొబ్బరి నూనె, వంటసోడాతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే?

కొబ్బరి నూనెలో కొద్దిగా వంటసోడా, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. వంటసోడాలో కొద్దిగా నీళ్ళు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మి

కొబ్బరి నూనెలో కొద్దిగా వంటసోడా, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. వంటసోడాలో కొద్దిగా నీళ్ళు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం పై గల మెుటిమలు తొలగిపోతాయి.
 
రోజ్ వాటర్‌లో వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. వంటసోడాలో టూత్‌పేస్ట్ కలుపుకుని నల్లటి వలయాలు రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. 
 
యాపిల్ సైడర్ వెనిగర్‌లో వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల పాటు మర్దన చేసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది.