మహిళలు కుంకుమ పువ్వును నూనెను ఇలా వాడితే? (video)
మహిళలు కుంకుమపువ్వును పాలతో మరిగించి రోజూ తింటే ఆరోగ్యం, చర్మకాంతి మెరుగవుతుందనేది వాస్తవం. కొన్ని చుక్కల కుంకుమపువ్వు నూనెను తీసుకుని ముఖానికి రాసి మర్దన చేసి అరగంట నానబెట్టి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే రక్తప్రసరణ పెరిగి ముఖం మెరుస్తుంది. గర్భిణులకు మూడో నెల నుంచి పాలలో కుంకుమపువ్వు ఇస్తే బిడ్డకు, తల్లికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కుంకుమపువ్వును ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్‌ను నిరోధించవచ్చు. డిప్రెషన్, మానసిక అలసటతో బాధపడేవారు కుంకుమపువ్వును తీసుకుంటే, అది శరీరంలో సెరోటోనిన్ విడుదల చేయడం ద్వారా డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. కుంకుమపువ్వు తీసుకోవడం ద్వారా వయసు సంబంధిత అంధత్వం తగ్గుతుంది.
కుంకుమపువ్వు కళ్లలో దెబ్బతిన్న కణజాలాలను పునరుత్పత్తి చేయడానికి కూడా సహాయపడుతుంది. ఆస్తమా రోగులకు కుంకుమపువ్వు ఒక వరం. ఇది ఊపిరితిత్తులలోని కణజాలాల వాపును తగ్గించి రక్తనాళాలను సాఫీగా ఉంచుతుంది. ఇది గాలి నాళాలు సజావుగా పని చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు కుంకుమపువ్వు తీసుకుంటే కీళ్ల వాపు తగ్గుతుంది. కీళ్ల బలహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.
మంచి కుంకుమ పువ్వును గుర్తించడానికి, కొన్ని కుంకుమపువ్వు ముక్కలను కొద్ది మొత్తంలో నీటిలో వేసి, ఆ నీరు వెంటనే ఎర్రగా మారితే, అది నకిలీ. 10 లేదా 15 నిమిషాల తర్వాత రంగు మారి మంచి వాసన వస్తే అది నిజమైన కుంకుమ పువ్వు అని చెప్పొచ్చు. ఇక కుంకుమ పువ్వు నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ఉండే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. ఇది చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే బ్లాక్‌హెడ్స్‌ను తొలగిస్తుంది.