Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నలో కొద్దిగా మీగడను కలిపి ముఖానికి రాసుకుంటే?

చర్మం పొడిగా మారితే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. పొడి చర్మాన్ని మృదువుగా చేసేందుకు చాలామంది వివిధ రకాల క్రీములపై ఆధాపడుతుంటారు. కానీ అలాంటి కృత్రిమ పదార్థాల జోలికి వెళ్లకుండా ఇంట్లో సహజ సిద్ధంగా లభిం

Written By Kowsalya
Updated: సోమవారం, 6 ఆగస్టు 2018 (16:33 IST)
చర్మం పొడిగా మారితే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. పొడి చర్మాన్ని మృదువుగా చేసేందుకు చాలామంది వివిధ రకాల క్రీములపై ఆధాపడుతుంటారు. కానీ అలాంటి కృత్రిమ పదార్థాల జోలికి వెళ్లకుండా ఇంట్లో సహజసిద్ధంగా లభించే వెన్నతోనే డ్రై స్కిన్ సమస్యల నుంటి విముక్తి చెందవచ్చును.
 
స్పూన్ వెన్నలో స్పూన్ మీగడను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. ముఖం కాంతివంతమవుతుంది. అరటి పండు గుజ్జులో కొద్దిగా వెన్నను కలుపుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల ముడతలు తొలగిపోతాయి. 
 
వెన్నలో చిటికెడు పసుపును కలుపుకుని ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. వెన్నలో ఉడికించిన క్యారెట్ గుజ్జును కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా వెన్నను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది. 
About Author
Kowsalya

అన్నీ చూడండి

మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలికంగా బ్రేక్

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆ తేదీని వెల్లడించాల్సిందే?

తమిళ ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధం : సీఎం విజయ్

డిప్యూటీ సీఎం పవన్‌ చిత్ర పటానికి పాలాభిషేకం, ఎందుకు?

అన్నీ చూడండి

'పెద్ది' చిత్రాన్ని రాం చరణ్ భుజాలపై మోశారు - కానీ, ఆ ఒక్కటీ లోటుంది : పరుచూరి గోపాలకృష్ణ

Paradise teaser: పారడైజన్ జాగా కోసం నాని రక్తపాతం స్రుష్టించిన టీజర్ వచ్చేసింది

Korean Kanakaraju Review : రొటీన్ ఫార్మెట్ అయినా థ్రిల్ కలిగించే కథగా కొరియన్ కనకరాజు - రివ్యూ

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్

వారి వల్లే 'చెన్నై లవ్ స్టోరీ రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది - సాయి రాజేష్

తర్వాతి కథనం
Show comments