Daily Horoscope
✕

రింగు రింగుల శిరోజాలను కాపాడుకునే బ్యూటీ టిప్స్

చాలా మందికి రింగు రింగుల వెంట్రుకలు ఉంటాయి. ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. అయితే, ఇలాంటి జట్టును కాపాడుకునేందుకు వారు చాలా శ్రమిస్తుంటారు. నిజానికి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఇలాంటి జ

Written By pnr
Updated: ఆదివారం, 10 జూన్ 2018 (14:27 IST)
చాలా మందికి రింగు రింగుల వెంట్రుకలు ఉంటాయి. ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. అయితే, ఇలాంటి జట్టును కాపాడుకునేందుకు వారు చాలా శ్రమిస్తుంటారు. నిజానికి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఇలాంటి జట్టును సులభంగా రక్షించుకోవచ్చని సౌందర్య నిపుణులు చెపుతున్నారు.
 
స్నానం చేసిన తర్వాత జుట్టుని సహజంగా గాలికి ఆరనివ్వాలి. డ్రయ్యర్‌ని వాడితే జుట్టు విరిగిపోయే అవకాశం ఉంది. అందువల్ల దానికి దూరంగా ఉండటం ఎంతో మంచిది. జుట్టు మరీ గట్టిగా రింగులు తిరిగిపోకుండా ఉండాలంటే యాంటీ ఫ్రిజ్ సిరమ్‌ని వాడితే సరిపోతుంది. ఈ సిరమ్‌ని జుట్టు కుదుళ్ల నుంచి రాయాలి. గట్టిగా ఉన్న రింగుల జుట్టుపై మరింత బలప్రయోగం చేయకుండా కొంత వరకూ పొడవు తగ్గించుకుంటే మంచింది.
 
సాధారణ జుట్టు కంటే రింగుల జుట్టు వాతావరణ మార్పులకు వెంటనే ప్రభావితమవుతుంది కాబట్టి, రింగుల జుట్టు ఉన్నవారు మరింత శ్రద్ధ తీసుకోవాలి. అందుకనే షాంపూతో వారానికోసారైనా తప్పకుండా తల స్నానం చేయడం మంచిది. దానివల్ల చర్మం జిడ్డులేకుండా ఉంటుంది.
 
మాయిశ్చరైజింగ్ షాంపూ అయితే జుట్టుని పొడిగా ఉంచడానికి తోడ్పడుతుంది. వారంలో వీలైనన్ని సార్లు షాంపూతో తలస్నానం చేసినా జుట్టు జిడ్డు లేకుండా ఆరోగ్యంగా కనిపిస్తుంది. షాంపూ వాడని రోజుల్లో జుట్టుని వేడి నీటితో కడగాలి. దీనివల్ల పోషణ ఇచ్చే సహజ నూనె పదార్థాలు కోల్పోకుండా జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.
 
ఆల్కహాల్ కలిగి ఉన్న ఉత్పాదనలను వాడటం వల్ల జుట్టు పొడిగా మారుతుంది. అందువవల్ల రింగుల జుట్టు ఉన్న వారు ఆల్కహాల్ ఉన్న ఉత్పాదనలను వాడకుండా ఉండటం మంచిది. రింగుల జుట్టుని మరింత ఆకర్షణీయంగా మార్చుకోవాలంటే నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

ఎలక్ట్రిక్ కారు ఎంత పనిచేసింది? స్టార్ట్ చేయకుండానే దూసుకెళ్లింది, వీడియో

రోడ్డును ధ్వంసం చేసిన వైకాపా నేతపై నాన్ బెయిలబుల్ కేసు : పవన్ కళ్యాణ్

చెరువులో పడిపోయిన కారు.. డ్రైవర్‌కు నిద్రమత్తు రావడంతో... (video)

హైదరాబాద్‌లో హనీట్రాప్.. పోలీసులకే వల వేసిన కేటుగాడు.. యువతిగా నటించి...?

ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

రీల్ హీరో కాదు... రియల్‌ లైఫ్‌లోనూ హీరోనే..: టైగర్‌ ష్రాఫ్‌పై నెట్టింట ప్రశంసలు

Ramayana premiere: లాస్ ఏంజెల్స్‌ అకాడమీ మ్యూజియంలో రామాయణ వరల్డ్ ప్రీమియర్

కథ చెప్తానని.. చీరలోనే హోటల్ గదికి రమ్మన్నాడు.. ఆ గదిలో ఒక మంచం మాత్రమే... సోనాలి కులకర్ణి

నటి రాఖీ సావంత్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ.. ఎందుకంటే?

చంద్రహాస్ కోట్ల హీరోగా కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో నూతన చిత్రం

తర్వాతి కథనం
Show comments