సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By pnr
Last Updated : ఆదివారం, 10 జూన్ 2018 (14:15 IST)

ద్రాక్షపండ్ల గుజ్జులో నిమ్మరసం కలిసి శరారీనికి రాసుకుంటే...

చాలామంది ముఖంతో పాటు చర్మం కూడా పొడిబారిపోయి ఉంటుంది. ఇలాంటివారు ఇంటిపట్టునే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. పొడిబారిన చర్మానికి తేమ ఇవ్వొచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలు...

చాలామంది ముఖంతో పాటు చర్మం కూడా పొడిబారిపోయి ఉంటుంది. ఇలాంటివారు ఇంటిపట్టునే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. పొడిబారిన చర్మానికి తేమ ఇవ్వొచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలు...
 
ఓ కప్పు ద్రాక్ష పండ్లను గుజ్జులా చేయాలి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి శరీరానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత నీటితో తొలగిస్తే సరి. నిమ్మ సుగుణం సహజ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. ద్రాక్ష పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. 
 
అలాగే, నిద్రించే ముందు పావుకప్పు తేనెలో చెంచా కొబ్బరి నూనె, మూడు చుక్కల నిమ్మరసం వేసి చర్మంపై రాసుకోవాలి. మరుసటి రోజు గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. 
 
అదేవిధంగా, స్నానం చేయడానికి ముందు శెనగపిండిలో కొంచెం పెరుగు కలిపి నలుగు పెట్టుకోవాలి. అది మృతకణాలను తొలగించి చర్మం పొడిబారకుండా చేస్తుంది. కప్పు పుదీనా ఆకులు, ఐదు బాదం పలుకులను కలిపి మెత్తగా నూరాలి. దీనికి చిటికెడు పసుపు చేర్చి చర్మానికి రాసుకుంటే గరుకైన చర్మం మృదువుగా మారుతుంది.
 
ఎండబెట్టి పొడిచేసిన కరివేపాకును ముల్తాని మట్టిలో కలిపి ముఖానికి రాసుకోవాలి. పూర్తిగా ఆరాక నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ చర్మాన్ని తేమగా ఉంచడంతోపాటు మొటిమలు, మచ్చల్లాంటి వాటిని తొలగిస్తుంది. ముఖం తాజాగావుండాలంటే ఒక క్యారెట్‌ గుజ్జుకు చెంచా వెన్న కలిపి రాసుకోవాలి. ఇలాక్రమం తప్పకుండా చేస్తే కొన్నివారాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.