శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (14:52 IST)

అందమైన కళ్ల కోసం.. ఆముదం నూనె దివ్యౌషధం.. ఎలా వాడాలంటే?

అందమైన కళ్ల కోసం.. మహిళలు ఏవేవో టిప్స్ పాటిస్తారు. కాస్మెటిక్స్ కోసం భారీగా ఖర్చుపెట్టేస్తారు. కానీ అందమైన, ఆకర్షణీయమైన కళ్ళ కోసం.. ఓ సూపర్ చిట్కా వుంది. అదేంటో తెలుసా.. అదేమిటంటే నువ్వుల నూనెను రాయటం

అందమైన కళ్ల కోసం.. మహిళలు ఏవేవో టిప్స్ పాటిస్తారు. కాస్మెటిక్స్ కోసం భారీగా ఖర్చుపెట్టేస్తారు. కానీ అందమైన, ఆకర్షణీయమైన కళ్ళ కోసం.. ఓ సూపర్ చిట్కా వుంది. అదేంటో తెలుసా.. అదేమిటంటే నువ్వుల నూనెను రాయటం. రాత్రి పడుకునే ముందు ఆముదం నూనె గాని, కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని రాస్తే ముడతలు పోయి, చర్మం మృదువుగా మారి, మచ్చలు కూడా పోతాయట. 
 
అలాగే కంటి వలయాలపై నువ్వుల నూనె రాత్రి లైట్‌గా మసాజ్ చేసుకుంటే అందానికి అందంతో పాటు కంటికి విశ్రాంతి లభించినట్లవుతుందని.. కంటి నరాలు మసాజ్ ద్వారా రిలాక్స్ అవుతాయని బ్యూటీషన్లు అంటున్నారు. తద్వారా దృష్టి లోపాలు దూరం కావడం, కంటిపై ఒత్తిడి పడటాన్ని నివారించుకోవచ్చు.