బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (15:20 IST)

ఓట్స్‌లో ఆలివ్ నూనెను కలుపుకుని జుట్టుకు రాసుకుంటే?

వర్షాకాలంలో జుట్టు తడవడం వలన తలంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. అందుచేత కొంతమంది షాంపూలతో అదేపనిగా తలస్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉండదు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొంద

వర్షాకాలంలో జుట్టు తడవడం వలన తలంతా జిడ్డుజిడ్డుగా ఉంటుంది. అందుచేత కొంతమంది షాంపూలతో అదేపనిగా తలస్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉండదు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనెను, కాచిన పాలు, కొబ్బరినూనెను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. తద్వారా చివర్లు చిట్లకుండా ఉంటాయి. కొబ్బరి పాలలో కొద్దిగా ఆలివ్ నూనె, కోడిగుడ్డు తెల్లసొన కలుపుకుని తలకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
 
ఓట్స్‌లో కొద్దిగా పచ్చిపాలు, స్పూన్ ఆలివ్ నూనెను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు మెరుస్తుంది. జిడ్డుగా ఉన్న తలకు ఈ పూత చక్కగా పనిచేస్తుంది.