కంటి కింద నల్లని వలయాలు పోగొట్టే మార్గాలు
కంటి కింద నల్లని వలయాలు ముఖ సౌందర్యానికి ఇబ్బందిగా మారుతాయి. ఈ వలయాలను పోగొట్టేందుకు సహజపద్ధతిలో చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. బాదం పప్పును నానబెట్టి వాటిని మెత్తటి పేస్టులా చేసుకుని అందులో కొద్దిగా పచ్చి బంగాళాదుంప తురుము కలిపి కంటి కింద రాసుకుంటే వలయాలు తగ్గుతాయి. బాదం నూనెతో కంటి చుట్టూ మర్దన చేసుకుంటే కంటి కింద వలయాలు సమస్య అదుపులో ఉంటుంది.
కళ్ల కింద ముడతలు ఉంటే ఫ్రిజ్‌లో ఉంచిన టీ బ్యాగ్‌లను 15 నిమషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. కీరదోసకాయ ముక్కలను 10 నిమిషాలు పాటు కళ్లపై ఉంచుకుంటే కంటి కిందటి నల్లటి వలయాలు పోతాయి. పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసి ఆ మిశ్రంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని కళ్ల కింద రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేయాలి.
టమోటా జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, కీరదోస రసం కలుపుకుని కళ్ల కింద నల్లటి వలయాలకు రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. కాటన్‌తో చల్లని నీళ్లు లేదా పాలను తడిపి దాన్ని కంటి కింద వలయాలపై వత్తి తీసేస్తూ వుండాలి. ఐస్‌క్యూబ్స్ పెట్టి కాసేపు మర్దన చేస్తుంటే కూడా కంటి కింద వలయాలు క్రమేణా కనుమరుగవుతాయి.