ముఖం నల్లబడిందా..? చింతపండు రసంతో ఇలా చేస్తే?
ముఖం రంగు పాలిపోవడాన్ని సరిచేయడానికి అనేక బ్లీచింగ్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే రసాయన పద్ధతులు చర్మానికి హానికరం అని గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు ముఖం వర్చస్సును సంతరించుకోవాలంటే.. నేచురల్ బ్లీచింగ్ పద్దతులను పాటించాలి. అవేంటో చూద్దాం..
ముందుగా చింతపండును వేడి నీళ్లలో నానబెట్టి రసాన్ని బాగా పిండాలి. అందులో నిమ్మరసం, పసుపు పొడి, బియ్యప్పిండి, తేనె మిక్స్ చేసి కాసేపు నాననివ్వాలి.
ఆ తర్వాత ముఖాన్ని బాగా కడుక్కొని చింతపండు మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి పట్టించాలి. కొన్ని నిమిషాల తర్వాత, ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలాగే కొన్ని వారాల పాటు చేస్తే ముఖంపై ఉన్న నలుపు పోయి అసలైన రంగును సంతరించుకుంటుంది.