శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (20:25 IST)

రుచికరమైన క్రీమీ, పోషకాలతో ప్రోబయాటిక్‌ నేచురల్‌ పెరుగును విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌

తెలంగాణా కేంద్రంగా కలిగిన డీ2సీ ప్రీమియం డెయిరీ బ్రాండ్‌, సిద్స్‌ ఫార్మ్‌ నేడు ప్రోబయాటిక్‌ నేచురల్‌ కర్డ్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. దీనిని స్వచ్ఛమైన పాలు, పెరుగు ఉత్పాదనలతో తయారుచేసింది. ఈ ఉత్పత్తి తొలుత కేవలం సిద్స్‌ ఫార్మ్‌ యాప్‌ మీద తెలంగాణాలోని వినియోగదారులకు మాత్రమే లభ్యమవుతుంది. 400 గ్రాముల కప్‌ ప్రో బయాటిక్‌ నేచురల్‌ కర్డ్‌ అత్యంత సరసమైన రీతిలో 80 రూపాయలకు లభ్యమవుతుంది.
 
సిద్స్‌ ఫార్మ్‌ తమ ఏ2 దేశీ ఆవు నెయ్యిని నెల రోజుల క్రితం విడుదల చేసింది. దీనికి వినియోగదారుల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. హైదరాబాద్‌లోని పలు స్టోర్‌లతో పాటుగా బెంగళూరులోని ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌లలో కూడా సిద్స్‌ ఫార్మ్‌ ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. వీటిలో పన్నీర్‌, నెయ్యి, వెన్న వంటివి ఉన్నాయి. అంతేకాదు, తమ ప్రాధాన్యతలకనుగుణంగా వినియోగదారులు ఆవు, గేదె పాల నుంచి ఎంచుకోవచ్చు.
 
ప్రో బయాటిక్‌ నేచురల్‌ కర్డ్‌ విడుదల చేయడం గురించి సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌-ఎండీ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ, ‘‘మన రోజువారీ భోజనాలలో వదులుకోలేనట్టి భాగం పెరుగు. మన అమ్మమ్మలు, అమ్మలు ప్రతి రోజూ భోజనంతో పాటుగా పెరుగు తినమని చెప్పడం తెలిసిందే. ఎందుకంటే పెరుగు వల్ల పేగుల ఆరోగ్యంతో పాటుగా ఎముకల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. సిద్స్‌ ఫార్మ్‌ ప్రోబయాటిక్‌ కర్డ్‌లో ప్రొటీన్‌, కాల్షియం, జీర్ణక్రియకు తోడ్పడే బ్యాక్టీరియా ఉన్నాయి.  రోగ నిరోధక శక్తి మెరుగుపరచడంతో పాటుగా అంటువ్యాధుల ప్రమాదమూ తగ్గిస్తుంది’’ అని అన్నారు.