1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 మే 2022 (19:43 IST)

సిద్స్‌ ఫార్మ్‌ కోసం శక్తివంతమైన డెలివరీ భాగస్వాములుగా మారిన మిల్క్‌ ‘ఉమెన్‌’

sids
మహిళా కార్మిక శక్తిని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ ఇప్పుడు తమ మొదటి బ్యాచ్‌ మహిళా డెలివరీ పార్టనర్స్‌ను నియమించింది.

 
ఈ సందర్భంగా సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ, ‘‘మా మహిళా ఉద్యోగుల నుంచి మేము అతి గొప్ప పురోగతిని చూశాము. మా సంస్థను మరింత అనుకూలమైన, లింగసమానత్వం కలిగిన సంస్ధగా మలుస్తామనే మా వాగ్దానం నెరవేర్చడంలో మరో ముందడుగు’’అని అన్నారు

 
ఆయనే మాట్లాడుతూ, ‘‘శ్రామిక శక్తి పరంగా మహిళలు ఎప్పుడూ ముందే ఉంటారు. వారి శక్తిని గుర్తించడం ద్వారా మరింత మంది వినియోగదారుల చెంతకు మేము చేరగలుగుతున్నాము. అదే సమయంలో ఉదయమే డెలివరీలను సైతం చేయగలుగుతున్నాము. కేవలం మగవారు మాత్రమే పాల డెలివరీ చేయగలరనే భావనను మేము పోగొట్టడంతో పాటుగా మిల్క్‌ మెన్‌ అనే పదాన్ని సవాల్‌ చేస్తున్నాం’’ అని అన్నారు.

 
సిద్స్‌ ఫార్మ్‌ ఇప్పుడు  ఈ మహిళా డెలివరీ పార్టనర్స్‌ బృందంలో సభ్యుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. మొదటి గ్రూప్‌లో ఏడుగురు మహిళా సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్యను త్వరలోనే 50కు పెంచనున్నారు.