మగువలూ మీ పెదాలు ఎర్రగా.. గులాబీ రేకుల్లా ఉండాలంటే..?!

మగువలకు పెదాలు ఎర్రగా ఉంటే అందం, ఆకర్షణ. ఎండలో తిరగడం, కాలుష్యం, పొగ, టీ, కాఫీ తాగడం వల్ల కొన్ని సార్లు హర్మోన్ల అసమతుల్యత ఏర్పడడం వల్ల గులాబీ రంగు పెదవులు నల్లగా మారుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పా

శనివారం, 30 జులై 2016 (13:03 IST)
మగువలకు పెదాలు ఎర్రగా ఉంటే అందం, ఆకర్షణ. ఎండలో తిరగడం, కాలుష్యం, పొగ, టీ, కాఫీ తాగడం వల్ల కొన్ని సార్లు హర్మోన్ల అసమతుల్యత ఏర్పడడం వల్ల గులాబీ రంగు పెదవులు నల్లగా మారుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే అందమైన, ఎర్రటి పెదాలను మీ సొంతం చేసుకోవచ్చు.

దీనికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఏం చేయాలంటే.. కుంకుమపువ్వులో ఒక టీస్పూను పాలు, ఒక టీస్పూను మీగడలని కలిపి ఆ మిశ్రమాన్ని కొద్ది సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లబడిన తర్వాత ఆ మిశ్రమాన్ని పెదాలమీద రాసుకుని సుతిమెత్తంగా రుద్దుకోవాలి. ఇలా చేస్తే పెదావులు మృదువుగా మారుతుంది
 
అలాగే ఒక టేబుల్‌ స్పూను పాలలో కొన్ని గులాబీ రేకులు వేసి నానబెట్టాలి. అందులో బాదం పొడి వేసి పేస్టులా తయారుచేయాలి. ఆ పేస్టును పెదాలపై రాసి 10-15 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత దూదితో పెదాలను తుడిచేసుకోవాలి. ఇలా చేస్తే నల్లగా మారిన పెదవులు ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది.బీట్‌రూట్‌ రసంలో ఒక టీస్పూను మీగడ వేసి పెదాలపై రాసుకోవాలి. కొన్ని నిమిషాలు అయిన తర్వాత పెదాలను చల్లటి నీటితో కడిగేసుకోవాలి. దీంతో ఎర్రటి పెదవులు మీ సొంతమవుతుంది.

అన్నీ చూడండి

తెలుగు రాష్ట్రాల్లో జూలై 4, 2026 నాటి వాతావరణం ఎలా వుంది...?

ప్రేయసికి నిశ్చితార్థం.. వివాహిత ప్రియుడి బెదిరింపులు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

అమరావతిపై కోర్టును ఆశ్రయించనున్న విజయ్ సాయి రెడ్డి.. సిగ్గు సిగ్గు.. అంటూ ఫైర్

హమ్మయ్య.. రుషికొండను అలా ఉపయోగించనున్న ఏపీ సర్కారు?

గిరిజన గ్రామంలో తాగు నీటి కొరత.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన

అన్నీ చూడండి

కామాఖ్య నుంచి హార్ట్ ఫుల్ మెలోడీ ఏముందో ఏమో సాంగ్ రిలీజ్

జయకృష్ణ ఘట్టమనేని శ్రీనివాస మంగాపురం విడుదల తేదీ ఖరారు

ఫస్ట్ డే నాగ బంధం, రావు బహదూర్ ఓపెనింగ్స్ రిపోర్ట్

Samantha recored: మా ఇంటి బంగారం తో బాక్సాఫీస్ రికార్డును అధిగమించిన సమంత రూత్ ప్రభు

Ntr: అఖిల్ అక్కినేని 'లనిన్ ట్రైలర్‌కు టాలీవుడ్ తారల మద్దతు

తర్వాతి కథనం
Show comments