సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (16:22 IST)

శీతాకాలంలో తేనె, పాలు కలిపిన ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే?

శీతాకాలంలో చర్మం నిగారింపును సంతరించుకోవాలంటే.. పాలూ, పెరుగుతీసుకోవాలి. ఇవి చర్మంలోని మృత కణాలను దూరం చేస్తాయి. ముఖం పగిలి పొలుసులుగా రాలకుండా ఉండాలంటే తేనె, పాలు కలిపిన ఫేస్‌ప్యాక్‌లను ప్రయత్నిస్తే మ

శీతాకాలంలో చర్మం నిగారింపును సంతరించుకోవాలంటే.. పాలూ, పెరుగుతీసుకోవాలి. ఇవి చర్మంలోని మృత కణాలను దూరం చేస్తాయి. ముఖం పగిలి పొలుసులుగా రాలకుండా ఉండాలంటే తేనె, పాలు కలిపిన ఫేస్‌ప్యాక్‌లను ప్రయత్నిస్తే ముఖానికి తగిన తేమ అంది చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది. చలిగాలిలో ఎక్కువ సేపు ప్రయాణించాల్సి వస్తే స్కార్ఫ్ ‌తో మెడా, ముక్కూ, పెదవులు కప్పేయాలి. చలికి చర్మం చిట్లిపోయే భాగాల్లో అవే ముందుంటాయి. 
 
అలా పాడైన చర్మానికి ఏ అలంకరణ చేసినా బాగుండదు. ఒకవేళ చలికి పగిలి ముఖం ఎర్రగా మారితే ఆ ప్రాంతాల్లో గ్రీన్‌టిన్‌టెడ్‌ మాయిశ్చరైజర్‌ని రాస్తే ఫలితం ఉంటుంది. వేసవికాలంలో మాత్రమే చెమటకు అలంకరణ కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా పెదవులు పగిలిపోయే కాలం కాబట్టి మ్యాటీ తరహా లిప్‌స్టిక్‌లు వేసుకోకూడదు. సన్‌స్క్రీన్‌ ఉండే టిన్‌టెడ్‌ లిప్‌బామ్‌లకు ప్రాధాన్యం ఇవాల్సి ఉంటుంది.