గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 25 మే 2017 (11:59 IST)

వేసవిలో చర్మానికి మేలు చేసే గంధం.. మొటిమలు తగ్గాలంటే?

గంధాన్ని రోజ్‌వాటర్‌లో కలిపి ముఖానికి వేసవిలో రాసుకోవడం ద్వారా చెమటకాయలు తగ్గిపోతాయి. సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు గంధం ఎంతగానో ఉపయోగపడుతుంది. పాలతో గంధాన్ని అరగదీసి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత

గంధాన్ని రోజ్‌వాటర్‌లో కలిపి ముఖానికి వేసవిలో రాసుకోవడం ద్వారా చెమటకాయలు తగ్గిపోతాయి. సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు గంధం ఎంతగానో ఉపయోగపడుతుంది. పాలతో గంధాన్ని అరగదీసి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే.. చర్మకాంతి పెరుగుతుంది. రోజూ పసుపు, గంధం కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గి చర్మానికి మంచి రంగు సంతరించుకుంటుంది. 
 
అలాగే గంధపు నూనెను నాలుగు చుక్కలు తీసుకుని స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరవు. గంధం నూనెను ఆలీవ్ ఆయిల్‌లో కలిపి శరీరానికి పట్టించి.. మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. ఇంకా ఆ గంధంలో హారతి కర్పూరం కలిపి ముఖానికి పట్టిస్తే.. మొటిమలు దూరమవుతాయని బ్యూటీషన్లు సలహా ఇస్తున్నారు.