Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండకు చర్మం కమిలిపోతుందా? అయితే ఇలా చేయండి...

Written By ఠాగూర్
Updated: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (14:16 IST)
చాలా మందికి వేసవి కాలంలో చర్మ సమస్యలు ఉత్పన్నమవుంటాయి. దీనికి కారణం.. శరీరం అధిక వేడిమిని తట్టుకోలేక పోవడంతో ఈ సమస్యలు వస్తుంటాయి. మరికొందరికి చర్మం కమిలిపోతుంది. ఇంకొందరికి శరీరమంతా చెమటకాయలు పుట్టుకొస్తాయి. మరోవైపు అధిక చమటతో రాషెస్‌ లాంటివి వస్తుంటాయి. 

వీటికి ఎన్ని మందులు వాడినా అవి తగ్గవు. ఇలాంటి సమస్యలకు ఒక్కటే పరిష్కారమార్గం ఉంది. అదే.. అలోవేరా. తెలుగులో కలబంద. నిత్యం మన ఇంటి ముందర ఉండే అలోవేరాతో చర్మ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడవచ్చు. మెరిసే అందమైన ఛాయను పొందవచ్చు. 

పొడిబారిపోయిన చర్మం ఉంటే కనుక అలోవెరాని మాయిశ్చరైజర్‌గా ఉపయోగించడం మంచిది. దీనివల్ల చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఇందుకోసం మార్కెట్‌లో లభ్యమయ్యే కంపెనీలకు చెందిన అలోవెరా క్రీమ్‌ని వాడొచ్చు. అలోవెరాని తీసుకుని అప్లై చేయడం వల్ల కూడా స్కిన్ హైడ్రేట్‌గా ఉంటుంది. వేసవిలో ఇది చర్మాన్ని బాగా కాపాడుతుంది.

ఈ కలంబ గుజ్జు కేవలం చర్మంపొడిబారకుండానే కాకుండా చర్మ సమస్యలు, దురదలు మంటలు వంటివి కలిగినపుడు మంచి ఉపశమనం పొందవచ్చు. అలోవెరాకు చల్లదనాన్ని ఇచ్చే గుణం అధికం. అందువల్ల దురదకలిగిన ప్రదేశంలో ఈ జెల్‌ను రాయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. మరీ ఎక్కువగా ఉంటే రాత్రి పూట అలోవెరా జెల్ ని రాసి ఉదయాన్నే చల్లని నీళ్ళ తో కడిగేయాలి. 

చర్మం పొడిబారిపోయినా, మంట వున్నా అలోవెరా గుజ్జు పూస్తే బాగా పనిచేస్తుంది. ఎస్‌పి‌ఎఫ్‌తో కలిపి అలోవెరాని రాసినట్లయితే అతినీలలోహిత కిరణాల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలోవెరా కేవలం పొడిబారిపోయే చర్మం, దద్దుర్లు మంటలకి మాత్రమే కాదు. మంచి అందమైన చర్మాన్ని కూడా సొంతం చేస్తుంది. అలానే జుట్టుకు కూడా అలోవెరా చాలా మంచిది. 

అన్నీ చూడండి

అభిషేక్ బెనర్జీకి హైకోర్టులో చుక్కెదురు : మధ్యంతర స్టే ఎత్తివేస్తామంటూ హెచ్చరిక

ఖమ్మం గురుకుల పాఠశాలలో విషాదం.. గుండెపోటుతో విద్యార్థి మృతి.. ఆడుకుంటూ..?

Uppal Pista House Cake- ఉప్పల్ పిస్తా హౌస్ కేక్ తిని వేవిళ్ళు.. అస్వస్థత

అటవీ శాఖ అధికారిపై గాయపడిన చిరుతపులి దాడి.. ఏం జరిగిందంటే? (video)

చేతివృత్తుల వారికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments