Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిలో క్యాబేజీ ముక్కలు వేసి..?

Updated: శనివారం, 16 మార్చి 2019 (16:30 IST)
మండే ఎండల్లో చర్మ సంరక్షణకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఎండలో చర్మం కమిలినట్లయితే ముఖ్యంగా పొడిచర్మం కలిగినవారు పంచదార, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచు చేస్తుంటే చర్మ తాజాగా తయారవుతుంది. 
 
స్పూన్ బంగాళాదుంప రసం, స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు అప్లై చేసుకుని పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. రోజూ ఇలా చేస్తూనే ఉండాలి. అప్పుడే.. వేసవికాలంలో వచ్చే చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
కీరా రసంలో స్పూన్ చల్లని పాలు కలిపి ముఖచర్మానికి రాసి పావుగంట ఆగిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు రాయాలి. మూడు టేబుల్ స్పూన్ల పాలు, స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించి, కొద్దిసేపాగి కడుక్కుంటే ఫలితం ఉంటుంది. 
 
కొద్దిగా అలోవేరా ఆకులు తీసుకుని నలిపి, నిమ్మరసం కలిపి పేస్ట్ మాదిరి చేసి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారి మెరిసిపోతుంది. ఆలివ్ ఆయిల్ మసాజ్ వలన కూడా ఫలితం కనిపిస్తుంది. రెండు స్పూన్ల తేనె, నిమ్మరసం కలిపి కమిలిన చర్మంపై రాయాలి. దాంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
 
నీటిలో క్యాబేజీ ముక్కలు వేసి కాచి, నీటిని వడగట్టి, ముక్కల్ని గుజ్జులా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఆగిన తర్వాత కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేయాలి.

అన్నీ చూడండి

తెలంగాణాలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భర్త మెడకు కరెంట్ వైర్ బిగించి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య

నేపాల్ వరద ప్రళయం మృతులు 675 - 275 మంది భారతీయుల జాడ ఎక్కడ?

నేడు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష - మద్యం సేవించి పరీక్షకు వచ్చిన విద్యార్థి

నేపాల్‌కు మళ్లీ వరద హెచ్చరిక - అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments