మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 2 జనవరి 2019 (20:48 IST)

అందాన్ని పెంచే 5 ఆకులు... ఏంటవి?

సాధారణంగా స్త్రీలు అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందాన్ని పెంచుకోవడం కోసం రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. దీనివలన అంతగా ప్రయోజనం ఉండదు. కనుక సహజంగా మనకు మన పెరట్లో దొరికే అనేక మెుక్కల ద్వారా మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
 
1. పుదీనా ఆకులను అలాగే తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మ రంధ్రాలను మరియు ముఖాన్ని శుభ్రం చేస్తుంది. దీనిని క్రమంతప్పకుండా అనుసరించడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
2. మనకు ప్రకృతిలో సహజంగా లభించే వేపలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ముఖ ఛాయను మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉండటం వలన మొటిమలు, తామర, సోరియాసిస్, చుండ్రు వంటి వాటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. వీటితో పాటుగా చక్కటి మరియు ఆరోగ్యకర ముఖ ఛాయను అందిస్తుంది. అంతేకాదు వేప ఆకులు నీటిలో వేసి మరిగించి ఆ నీటితో వారానికొకసారి స్నానం చేయడం మంచిది. ఇది చర్మాన్ని చల్లగా మార్చుతుంది. మొటిమలను నివారిస్తుంది.
 
3. కరివేపాకు ఆహారానికి రుచిని ఇవ్వడం మాత్రమే కాకుండా అందంపరంగా కూడా ఎంతో సహాయం చేస్తుంది. కరివేపాకును నీటిలో వేసి బాగా మరిగించి చిటికెడు పసుపును కలిపి తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై ఉన్న డార్క్ స్పాట్స్‌ను నివారించుకోవచ్చు.
 
4. కొత్తిమీర డ్రై స్కిన్ నివారించండంలో బాగా సహాయపడుతుంది. గుప్పెడు కొత్తిమీరను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా తేనె, మరియు నిమ్మరసం మిక్స్ చేసి డ్రై స్కిన్‌కు అప్లై చేయాలి. ఇలా వారంలో రెండుమూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
5. కలబంద చర్మ ఛాయను మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. తేనె కలిపిన కలబందతో తయారుచేసిన ఫేస్ మాస్క్‌ను వేసుకొని 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ చర్మానికి కావలసిన తేమ అంది మీరు అందంగా కనబడేలా చేస్తుంది.