మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 29 డిశెంబరు 2018 (18:05 IST)

అందంగా ఉండాలంటే.. ఈ సూత్రాలు పాటించాలి..?

అందంగా ఉండాలంటే.. ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు అందం కోసం ఎన్ని పైపూతులు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా అందానికి మొదటి మెట్టు శుభ్రత. అజీర్ణం లేకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. 
 
రెండోది దంతాల శుభ్రత, నోటి దుర్వాసన లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నడక చాలా అవసరం. నడకతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది.
 
మూడోది బేలన్స్‌డ్ డైట్.. పోషకాహార విలువలు కలిగిన నియమితాహారం అందానికి ఓ సూత్రం. శరీరం లోపలి భాగాలకు శుభ్రతనీ, పుష్టినీ ఇచ్చే కూరగాయలు, పళ్ళు, వెన్న తీసిన మజ్జిగ వంటివి, జీర్ణకారకమైన పదార్థాలు తీసుకుంటే ఒంటికి నునుపు, మెరుపు, లావణ్యం వస్తాయి. 
 
మెడికల్ చెకప్స్.. రెగ్యులర్‌గా మెడికల్ చెకప్ చేయించుకుని అనారోగ్యం లేకుండా జాగ్రత్త పడాలి. రిలాక్సేషన్... మితిమీరిన పనికాకుండా, నియమితమైన పని అవసరం. ఆందోళనలు, భయాలు వదిలేయాలి. చక్కని సంగీతం, మంచి వినోదం వంటి సాధనాలతో రిలాక్స్ కావాలి. మానసికమైన ప్రశాంతత ముఖానికి కాంతిని, ఆకర్షణ ఇస్తుంది.