శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 29 డిశెంబరు 2018 (15:51 IST)

నిద్రలేవగానే ఏం చేస్తున్నారు...? ఇవేగా చేసేది...

నేటి తరుణంలో ఉదయం నిద్రలేవగానే ముందుగా ఫోన్స్, వాట్సప్, ఫేస్‌బుక్ వంటివి చెక్ చేస్తుంటారు. ఆ తరువాత లేచి ఈరోజు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. ఈ పద్ధతి మంచిది కాదంటున్నారు నిపుణులు. కనుక.. నిద్రలేవగానే ఈ కింద తెలిపిన కార్యక్రమాలు ప్రారంభిస్తే కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
 
1. నిద్రలేవగానే ఇంట్లో అలానే తెలిసిన వారితో గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. ఇది మీ మూడ్‌ను ఉత్సాహంగా మార్చుతుంది.
 
2. సాధారణంగా నిద్రలేవగానే టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. ఈ రెండింటికంటే గ్లాస్ నిమ్మనీళ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
3. నిద్రలేవగానే ఫోన్స్ వాడకం మానేయాలి. ఈ పద్ధతి ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక ఉదయం వాటిని ఉపయోగించకూడదు.
 
4. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని కూర్చుని.. ఊపిరి బాగా లోపలికి పీల్చి వదిలితే మంచిది. ఈ అలవాటు శ్వాసక్రియ ఉత్పత్తికి ఎంతో దోహదం చేస్తుంది.
 
5. ప్రతిరోజూ నిద్రలేచే సమయం కన్నా కాస్త ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే మేల్కోవడం కూడా ఆరోగ్యానికి ఒక మంచి అలవాటవుతుంది.