సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (22:25 IST)

వెస్పా వీఎక్స్ఎల్, ఎస్ఎక్స్ఎల్ ఫేస్‌లిఫ్ట్ 2020, నూతన ఏప్రిలియా స్ట్రామ్ మోడల్ పరిచయం

పియాజ్జియో ఇండియా నేడు రెండు నూతన ఆఫరింగ్స్ - ప్రతిష్టాత్మక వెస్పా వీఎక్స్ఎల్, ఎస్ఎక్స్ఎల్ ఫేస్‌లిఫ్ట్ 2020 శ్రేణి మరియు స్పోర్టీ నూతన ఏప్రిలియా స్ట్రామ్‌ను డిస్క్ బ్రేక్, డిజిటల్ క్లస్టర్‌తో ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. తమ వివేకవంతులైన వినియోగదారులకు ప్రీమియం ఫీచర్ల ద్వారా మెరుగైన సవారీ అనుభవాలను సృష్టించడమే లక్ష్యంగా వీటిని తీసుకువచ్చింది. ఈ కంపెనీ ఈ నూతన ఆఫరింగ్స్‌ను ఈ సంవత్సరారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2020 వద్ద ఆవిష్కరించింది.
 
ఇటీవలనే వెస్పా వీఎక్స్ఎల్, ఎస్ఎక్స్ఎల్ ఫేస్‌లిఫ్ట్ 2020 మోడల్స్‌ను 125 సీసీ మరియు 150 సీసీ బీఎస్ 6 ఇంజిన్స్‌కోసం ప్రీ బుకింగ్ ఆరంభించింది. వినియోగదారులు తమ ప్రాధాన్యతా నూతన వెస్పాను ఆన్‌లైన్‌లో ప్రదర్శితమవుతున్న మోడల్స్ నుంచి వెస్పా యొక్క ఈ-కామర్స్ వేదిక shop.vespaindia ద్వారా బుక్ చేసుకోవచ్చు మరియు నూతన ఏప్రిలియా స్ట్రామ్ స్కూటర్‌ను ఏప్రిలియా యొక్క ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ shop.apriliaindia వద్ద కాంటాక్ట్‌లెస్ అనుభవాల కోసం బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బుక్ చేసుకున్న ఎడల 2వేల రూపాయల విలువైన ప్రయోజనాలను ఆన్‌లైన్‌లో నూతన వెస్పా లేదా ఏప్రిలియాను 1000 రూపాయలు చెల్లించి బుక్ చేసుకున్న ఎడల లేదా దగ్గరలోని ఏప్రిలియా డీలర్‌షిప్‌ల వద్ద బుక్ చేసిన ఎడల పొందవచ్చు.
 
వెస్పా వీఎక్స్ఎల్ మరియు ఎస్ఎక్స్ఎల్ శ్రేణి మూడు కీలక వైవిధ్యతలను సాంకేతికంగా అత్యాధునికమైన మోనోకోక్యు ఫుల్ స్టీల్‌బాడీ, ప్రకాశవంతమైన హై డెఫినేషన్ 3 కోట్ బాడీ కలర్స్, యాంటీ -లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేదా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ట్విన్ పాట్ కాలిపర్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లతో వస్తుంది. నూతన శ్రేణి బీఎస్ 6 ప్రమాణాలను స్వచ్ఛమైన ఉద్గారాలు కలిగిన 3 వాల్వ్ టెక్నాలజీ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్‌తో అందిస్తుంది.
 
ఇది ఆకర్షణీయమైన పనితీరును అందిస్తుంది. పనితీరు మరియు సమర్థతను దృష్టిలో పెట్టుకుని నూతన లైఫ్‌స్టైల్ స్కూటర్ శ్రేణిలో పెటల్ డిజైన్ అల్లాయ్ వీల్స్ విశాలమైన టైర్లతో ఉండటంతో పాటుగా రైడర్‌కు సౌకర్యం మరియు విలాసంను అందిస్తుంది. అంతేకాదు, వైవిధ్యతను మెరుగుపరుచుకునేందుకు నూతన 2020 వెస్పా ఫేస్‌లిఫ్ట్ వీఎక్స్ఎల్ మరియు ఎస్ఎక్స్ఎల్ శ్రేణి ఇప్పుడు క్రిస్టల్ ఇల్యుమినేషన్ ఎల్ఈడీ హెడ్‌లైట్, సెంటర్ ఇంటిగ్రేటెడ్ డే టైమ్ రన్నింగ్ ఎక్స్‌ట్రా బ్రైట్ బీమ్ లైట్, యుఎస్‌బీ మొబైల్ చార్జింగ్ పోర్ట్ మరియు సౌకర్యం, శైలితో కూడిన బూట్ లైట్ వంటివి ఉన్నాయి.
 
మరోవైపు నూతన ఏప్రిలియా స్ట్రామ్ 125సీసీ డిస్క్ బ్రేక్ మరియు డిజిటల్ క్లస్టర్ మోడల్ ఏప్రిలియా స్ట్రామ్ అనుభవాలను 220ఎంఎం వృద్ధి చేయడం, ట్విన్ పాట్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు డిజిటల్ క్లస్టర్ ద్వారా పునర్నిర్వచిస్తుంది. వైవిధ్యమైన ఈ స్కూటర్ క్రాస్ఓవర్ బిల్డ్‌తో ఏప్రిలియా యొక్క రేసింగ్ స్ఫూర్తిని అత్యున్నత పనితీరు కలిగిన 3 వాల్వ్ టెక్నాలజీ, బీఎస్ 6 ఉద్గార ప్రమాణాలు కలిగిన ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్ మరియు 12 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, విస్తృతశ్రేణి క్రాస్ ప్యాట్రన్ టైర్లతో అందిస్తుంది. వినూత్నమైన ఏప్రిలియా శైలి, బోల్డ్ గ్రాఫిక్స్‌తో యువ రైడర్లకు పూర్తి వైవిధ్యతను అందిస్తుంది. 
 
వెస్పా వీఎక్స్ఎల్, ఎస్ఎక్స్ఎల్ ఫేస్‌లిప్ట్ 2020 శ్రేణి మరియు నూతన ఏప్రిలియా స్ట్రామ్ మోడల్‌ను ఆవిష్కరించడం గురించి శ్రీ డియోగో గ్రాఫీ, ఛైర్మన్ అండ్ ఎండీ, పియాజ్జియో ఇండియా మాట్లాడుతూ "మా ప్రతిష్టాత్మక బ్రాండ్లు వెస్పా మరియు ఏప్రిలియా నుంచి రెండు నూతన ఆఫరింగ్స్ ఆవిష్కరించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. వైవిధ్యమైన ఇటాలియన్ బ్రాండ్లుగా, మా వివేకవంతులైన వినియోగదారుల అనుభవాలను పునర్నిర్వచించడంతో పాటుగా వృద్ధి చేయడం పట్ల మేము కట్టుబడి ఉన్నాము.
 
సాంకేతికాధారిత ఫీచర్లను బ్రాండ్ వెస్పా జోడించడంతో పాటుగా ప్రీమియం అనుభవాలను సృష్టిస్తుంది మరియు బ్రాండ్ ఏప్రిలియా స్ట్రామ్‌ను మా సాంకేతిక వేదికపై నిర్మించడం వల్ల ఉత్సాహపూరితమైన సవారీ పనితీరును ప్రదర్శించడానికి మరియు నూతన బెంచ్‌మార్క్స్‌ను సృష్టించడానికి సిద్ధంగా ఉంది'' అని అన్నారు.
 
నూతన శ్రేణి 2020 వెస్పా ఫేస్‌లిఫ్ట్స్ మరియు నూతన ఏప్రిలియా స్ట్రామ్ మోడల్ ఇప్పుడు భారతదేశవ్యాప్తంగా వెస్పా మరియు ఏప్రిలియా డీలర్‌షిప్‌ల వద్ద లభ్యమవుతున్నాయి.