శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 14 డిశెంబరు 2021 (22:36 IST)

సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌టీపీఐ) డైరెక్టర్‌ జనరల్‌‌గా చేరిన అర్వింద్‌ కుమార్‌

సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌టీపీఐ) డైరెక్టర్‌ జనరల్‌‌గా అర్వింద్‌ కుమార్‌ చేరారు. కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(మీటీ) కింద ఏర్పడిన స్వయం ప్రతిపత్తి సంస్ధ ఎస్‌టీపీఐ. సాంకేతిక వ్యవస్ధాపకత, ఆవిష్కరణలను దేశంలో ప్రోత్సహిస్తున్న సంస్థ ఎస్‌టీపీఐ. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో 25కుపైగా కేంద్రాలను ప్రారంభించడం ద్వారా సాంకేతిక వ్యవస్ధాపకత మరియు ఆవిష్కరణలకు తోడ్పాటునందిస్తుంది. 

 
ఎస్‌టీపీఐ, డీజీ అర్వింద్‌ కుమార్‌ మాట్లాడుతూ తన అభిప్రాయంలో టెక్నాలజీ స్టార్టప్స్‌కు ఏకీకృత కేంద్రంగా ఎస్‌టీపీఐ నిలువాల్సి ఉందన్నారు. ప్రభుత్వ/మీటీ యొక్క లక్ష్యమైన ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను చేరుకునేందుకు స్టార్టప్స్‌  తోడ్పడతాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

 
ప్రస్తుతం ఎస్‌టీపీఐ నమోదిత సంస్థలు 5 లక్షల కోట్ల రూపాయల ఐటీ/ఐటీఈఎస్‌/ఈఎస్‌డీఎం ఎగుమతులను చేరుకున్నాయి. భారతదేశంలో  అతిపెద్ద టెక్‌ ఇన్‌క్యుబేటర్లలో ఎస్‌టీపీఐ ఒకటి. ఇండియా బీపీఓ ప్రమోషన్‌ స్కీమ్‌ 2.0 సూత్రీకరణలో ఎస్‌టీపీఐ సహాయపడుతుంది. ఎలకా్ట్రనిక్స్‌ రంగాన్ని మరింత బలోపేతం దిశగా ఎస్‌టీపీఐ ఇప్పుడు ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్‌ (ఈఎంపీ 2.0) పథకం సైతం చేపట్టింది.

 
ఎస్‌టీపీఐలో చేరక మునుపు శ్రీ అర్వింద్‌ కుమార్‌ ట్రాయ్‌లో పనిచేశారు. ట్రాయ్‌లో సలహాదారునిగా 2004 నుంచి ఆయన విధులను నిర్వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వారణాసిలో ఎంటెక్‌ డిగ్రీ చేశారాయన.