నెల్లూరు ఆయుర్వేద మందు: ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్‌తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి
నెల్లూరు ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ కిరణ్ రిజ్జు, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్‌కు సూచించారు.
నెల్లూరు ఆయుర్వేద మందు విషయంలో నెలకొన్న పరిస్థితులు ఉపరాష్ట్రపతి దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే కేంద్రమంత్రి మరియు డైరక్టర్ జనరల్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు.
వెంటనే ఆ మందు మీద అధ్యయనం ప్రారంభించి, వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు.