శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (10:16 IST)

బ్యాంకులకు మళ్ళీ వరుస సెలవు రోజులు

బ్యాంకులకు మళ్లీ వరుస సెలవు రోజులు వచ్చాయి. దీంతో బ్యాంకు లావాదేవీలు మరోమారు స్తంభించనున్నాయి. ఈ వారంలో వరుసగా కొన్ని రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. అయితే సోమవారం ఒక్కరోజే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 16 వరకు బ్యాంకులు ఆరు రోజులు పనిచేయవు. ఒక్కరోజు అది కూడా సోమవారం మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. 
 
ఈ కారణంగా బ్యాంకు లావాదేవీలు చేయాల్సి ఉంటే ఈ వారం మొదటి రోజే చూసుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారులు, ఉద్యోగులు సెలవుల అనుగుణంగా పనులు చూసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు. వరుస సెలవులతో ఎటిఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతోపాటు ఏప్రిల్ 21న శ్రీరామ నవమి కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
 
ఏప్రిల్ 12న బ్యాంకులు పని చేస్తాయి. ఏప్రిల్ 13న ఉగాది పండుగ, ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 15న హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ డే, ఏప్రిల్ 16న కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు, ఏప్రిల్ 21న శ్రీరామ నవమి, ఏప్రిల్ 24న నాలుగో శనివారం కావడంతో వరుస సెలవు రోజులు వచ్చాయి.