పెరిగిన కోడిమాంసం ధరలు.. ఎంతో తెలుసా?
కోడిమాంసం ధరలు అంటుతున్నాయి. సహజంగా వేసవిలో కోడి మాంసం ధరలు ఎక్కువగానే వుంటాయి. ఈ సీజన్‌లో కోళ్లకు సోకే వ్యాధులతో అవి మృతి చెందడం కారణంగా మాంసం ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ధరలు పెరుగుతాయి. అయితే ఈ వేసవిలో కోడి కూర ధరలు ఇంకాస్త పెరిగాయి.
బాయిలర్ మాంసం కిలో రూ.280 నుంచి రూ.285లుగా పలుకుతోంది. దీంతో పాటు ఫారం కోడి కిలో మాంసం రూ.200లు దాటింది. దీంతో మాంసప్రియులు జేబులు పట్టుకుంటున్నారు.