శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (09:46 IST)

మార్కాపురం రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ఏంటి?

ఏపీలోని గుంటూరు జిల్లా మార్కాపురంలో ఓ రెస్టారెంట్ యజమానికి పాత రూపాయి నోటుకు బిర్యానీ ఆఫర్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వయస్సుతో తేడా లేకుండా చిన్నాపెద్దా.. ముసలీ ముతక.. యువతీ యువకులు, స్త్రీపురుషులు ఇలా ప్రతి ఒక్కరూ బిర్యానీ కోసం రెస్టారెంట్ ముందు గుమికూడారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనరాకపోకలు స్తంభించిపోయాయి. 
 
మార్కాపురం పట్టణంలో ఓ ప్రైవేట్‌ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవ వేడుక జరిగింది. దీన్ని పురస్కరించుకుని పాత రూపాయి నోట్‌కు దమ్‌ బిరియానీ అని ప్రకటించడంతో జనం పెద్దఎత్తున వచ్చారు. తాకిడిని తట్టుకోలేక మధ్యాహ్నం వరకూ పంపిణీ చేసి నిలిపేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. మార్కాపురం - కంభం రహదారిపై ట్రాఫిక్‌ కూడా నిలిచిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.