శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (14:48 IST)

రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేసిన ఆర్బీఐ

currency notes
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన మరో పెద్ద నోటు రూ.2 వేల నోటు. ఈ నోటును ఇపుడు ముద్రించండం లేదని భారత రిజర్వు బ్యాంకు తెలిపింది. ముఖ్యంగా గడిచిన రెండేళ్లలో ఈ నోటు ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ పై విధంగా సమాధానమిచ్చింది. 
 
గత 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు కొత్తగా 2వ వేల నోట్లు ప్రింట్ చేయడం లేదు. కొంతకాలంగా రూ.2 వేల నోటు చాలమణిలో కనిపించడం లేదు. ఏటీఎంలలో కూడా రూ.500, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. మార్కెట్‌లో రూ.2 వేల నోటు కనిపించడమే అరుదైపోయిందని పలువురు దకాణాదారులు చెబుతున్నారు.
 
మరోవైపు, రూ.2 వేల నోటు ముద్రించక పోవడానికి కేంద్రం గతంలో లోక్‌సభలో వివరణ కూడా ఇచ్చింది. పెద్ద నోట్ల ముద్రణ ఆపేయడం ద్వారా నల్లధనాన్ని అరికట్టవచ్చని, నకిలీ నోట్ల బెడద నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది.