శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (09:34 IST)

నల్లధనానికి కేరాఫ్ అడ్రస్‌గా రూ.2 వేల నోటు : బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ

sushilkumarmodi
నల్లధనానికి రూ.2 వేల రూపాయల నోటు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, అందువల్ల ఆ నోటును తొలగించాలని బీజేపీ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ అన్నారు. అందువల్ల ఆ నోటును రద్దు చేయాలని సూచించారు. 
 
పార్లమెంట్ సమావేశాల్లోభాగంగా సోమవార జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ, కొందరు రూ.2 వేల నోట్లుదాచిపెట్టుకుని అక్రమాలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ఏటీఎంలలో కూడా రూ.2 వేల నోటు కనిపించడంలేదని అన్నారు. ఈ నోట్లను తీసుకుని రావడంలో ఎలాంటి హేతుబద్ధత లేదన్నారు. అందువల్ల ఈ నోటును చెలామణి నుంచి రద్దు చేయాలని ఆయన కోరారు.
 
అయితే, రూ.2 వేల నోట్లను ఇప్పటికిప్పుడు నిలిపివేయడం కూడా సరికాదన్నారు. దశల వారీగా వాటి చెలామణి నుంచి తొలగించాలని కోరారు. మన దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయన్నారు. అందువల్ల రూ.2 వేల వంటి పెద్ద కరెన్సీ నోట్ల అవసరం చాలా తక్కువ అని సుశీల్ కుమార్ మోడీ అన్నారు.