పాన్ ఇండియా ట్రెండ్ బాలీవుడ్‌కు మంచిది కాదు.. అనురాగ్
దర్శకుడు అనురాగ్ కశ్యప్ పాన్ ఇండియా సినిమాలపై సెన్సేషనల్ కామెంట్లు చేశారు. పాన్ ఇండియా ట్రెండ్ మంచిది కాదన్నారు. బాలీవుడ్ దర్శకనిర్మాతలు పాన్ ఇండియా సినిమాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టడం సరికాదని చెప్పారు. బాలీవుడ్‌కు కొత్తదనం వున్న కథలను ఎంచుకుని ఇండస్ట్రీకి ధైర్యం చెప్పే సినిమాలను తీస్తే సక్సెస్ దక్కుతుందని.. ఇవే ప్రస్తుతం బిటౌన్‌కు అవసరం తప్ప పాన్ ఇండియా సినిమాలు కాదన్నారు.
పాన్ ఇండియా ట్రెండ్ వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీ సర్వనాశనం అవుతుందని చెప్పుకొచ్చారు. పుష్ప, కేజీఎఫ్2, కాంతారా సినిమాలు దేశవ్యాప్తంగా సక్సెస్ సాధించినప్పటికీ.. ఇలాంటి సినిమాలను బాలీవుడ్ దర్శకనిర్మాతలు తీస్తే మాత్రం ఈ సినిమాలు సక్సెస్ సాధించవని అనురాగ్ కశ్యప్ అభిప్రాయం వ్యక్తం చేశారు.