శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-12-2022 మంగళవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చించిన శుభం...

Goddess Lakshmi
మేషం :- ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికం. మీ యత్నాలు గోప్యంగా సాగించాలి. స్త్రీల అవసరాలు, కోరికలు నెరవేరగలవు. విద్యార్ధినుల మొండితనం అనర్థాలకుదారితీస్తుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. పెద్దల ప్రమేయంతో కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి.
 
వృషభం :- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి మనస్పర్ధలు తలెత్తుతాయి. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి ఒత్తిడి అధికమవుతాయి. ప్రయాణాలు ఆలస్యం వల్ల పనులు వాయిదా పడతాయి. 
 
మిథునం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. రాజకీయ విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. 
 
కర్కాటకం :- హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. దాన, ధర్మాలు చేసి మంచి గుర్తింపు పొందుతారు. విద్యార్థుల అతి ఉత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. 
 
సింహం :- రాజకీయనాయకులు సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఏ పని మొదలెట్టినా ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. అపార్థాలు మాని ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
కన్య :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపకాలు తగ్గించుకుని ఉద్యోగ, వ్యాపారాలపై దృష్టి సారించండి. ఈడొచ్చిన మీ సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించడం మంచిది. ప్రముఖుల సిఫార్సులతో పనులు సానుకూలమవుతాయి.
 
తుల :- బంధు మిత్రులతో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవటం మంచిది కాదు. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. మీపై కొంతమంది నిఘా వేశారన్న విషయం గ్రహించండి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి.
 
వృశ్చికం :- రాజకీయనాయకులకు ప్రయాణాలలోనూ, ఆహార వ్యవహారాలలో మెళుకువ వహించండి. వ్యాపారాల్లో నష్టాలను క్రమంగా అధిగమిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సభలు, సన్మానాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
 
ధనస్సు :- మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. మీ గౌరవ, అభిమానాలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. ధనవ్యయంలో ఏకాగ్రత చాలా అవసరం. బ్యాంకు పనులు మందగిస్తాయి. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది.
 
మకరం :- కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సమస్యలు తప్పవు. ఖర్చులు, రాబడి విషయంలో ఏకాగ్రత వహించండి. సోదరులతో ఏకీభవించలేక పోతారు. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి.
 
కుంభం :- దైవ, సేవ, పుణ్యకార్యాలకు ఇతోధికంగా సహాయం అందిస్తారు. బంధువులను కలుసుకుంటారు. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు ఆందోళన అధికం అవుతుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ప్లీడర్లు కోర్టు వాదోపవాదాల్లో రాణిస్తారు.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. నిరుద్యోగుల నిర్లిప్తధోరణి వల్ల సదావకాశాలు జార విడుచుకుంటారు. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.