గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2022 (00:04 IST)

11-12-2022 ఆదివారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...

Astrology
మేషం:- వాణిజ్య ఒప్పందాలు, లీజు, ఏజెన్సీల వ్యవహరాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
 
వృషభం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరున్న వాస్తవం గ్రహించండి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. వేళకాని వేళ భుజించుట వలన ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి.
 
మిధునం:- అందరితో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. రవాణా రంగాలలోని వారికి ప్రయాణీకులతో ఇబ్బందులు తలెత్తుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.మీ బంధవులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం.
 
కర్కాటకం:- స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. బంధు మిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు.
 
సింహం:- వస్త్ర, గృహోపకరణ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. కొంత మొత్తం చెల్లించి రుణ దాతలను సంతృప్తిపరుస్తారు.
 
కన్య: - ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. మిమ్మలను పొగిడే వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. తలపెట్టిన పసులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వేడుకలు, దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం పొందుతారు.
 
తుల:- మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. ప్రయత్న పూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికమవుతుంది. విందులలో పరిమితి పాటించండి. తలపెట్టిన పసులు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో ఒక సష్టం మరో విధంగా పూడ్చుకుంటారు.
 
వృశ్చికం:- పత్రికా సిబ్బందికి విశ్రాంతి లోపం, పనిభారం అధికం. లౌక్యంగా మెలిగి పనులు చక్కబెట్టుకుంటారు. దుబారా ఖర్చులు అదుపు చేయగల్గుతారు. స్త్రీలు టీ.వీ కార్యక్రమాల్లో రాణిస్తారు. భాగస్వామికంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి షాపుల అలంకరణ, కొత్త స్కీములు అమలుచేస్తారు.
 
ధనస్సు:- ఆర్ధిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. దంపతులమధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు లాభాలనిస్తాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
మకరం:- ప్రతి విషయంలోను ఆచితూచి అడుగువేయవలసి ఉంటుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
కుంభం:- మీ అవసరాలు ఏదోవిధంగా నెరవేరగలవు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మీనం:- కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ శ్రీమతిసలహా ప్రకారమే నడుచుకుంటారు. మనోధైర్యంతో ముందుకుసాగండి. వేడుకలు, వనసమారాధనల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహన చోదకులకు చికాకులు తప్పవు. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకువస్తాయి.