శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (19:41 IST)

హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. ఢిల్లీ కస్టమర్ షాకయ్యాడు.. ఏం జరిగింది..

హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఢిల్లీ కస్టమర్ కు షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేస్తే పార్శిల్ వచ్చింది. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్.
 
గురుగ్రామ్‌లోని న్యూగ్లోబల్ సంస్థలో డైరెక్టర్ ఆఫ్ పాలసీ అండ్ అడ్వకసీ హోదాలో పనిచేస్తున్న ప్రతీక్ కన్వాల్ జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్ ద్వారా హైదరాబాద్‌లోని షాదాబ్ హోటల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. కొన్ని గంటల్లోనే పార్శిల్ వచ్చేసింది. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో బిర్యానీ లేదు. 
 
బిర్యానీతో పాటు ఇచ్చే సాలన్ మాత్రమే ఉంది. దీంతో సదరు కస్టమర్ షాకయ్యాడు. జొమాటో కస్టమర్‌గా, జొమాటో షేర్ హోల్డర్‌గా తనకు డబుల్ లాస్ అయిందని, ఈ సమస్యను పరిష్కరించాలని, జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్.. ప్లస్ ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి.