శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (11:50 IST)

జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్...వాహనదారులకు ఝలక్

కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్ సహా ఇతర పెట్రో ప్రొడక్టులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాలేదు. దీంతో వీటి ధరలు తగ్గే ఛాన్స్ లేదు. కరోనా మెడిసిన్స్‌పై జీఎస్‌టీ మినహాయింపు 2021 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. దీంతో ఇవి తక్కువ ధరకే అందుబాటులో ఉండనున్నాయి.
 
ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ వంటి ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే వారికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ఇకపై 5 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. అలాగే పార్లర్‌లో ఐస్‌క్రీమ్ తింటే 18 శాతం జీఎస్‌టీ పడుతుంది.
 
రైల్వే విడిభాగాలు, లోకోమోటివ్స్‌పై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. బయో డీజిల్‌పై జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. వికలాంగులు ఉపయోగించే వెహికల్స్‌పై జీఎస్‌టీని 5 శాతానికి కుదించారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ ద్వారా అందించే ఫోర్టిఫైడ్ రైస్‌ మీద జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.