ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మే 2023 (17:59 IST)

రూ.10లకే కేఎఫ్‌సీ-స్టైల్ ఫ్రైడ్ చికెన్‌ (video)

KFC
KFC
కేఎఫ్‌సీ-స్టైల్ ఫ్రైడ్ చికెన్‌ను రూ. 10కి విక్రయిస్తున్న ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో వైరల్‌గా మారింది. దీనిలో వీధి వ్యాపారి కేఎఫ్‌సీ తరహా వేయించిన చికెన్ ముక్కను రూ.10కి విక్రయిస్తున్నాడు.  
 
భారతీయ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. పానీ పూరీ, సమోసా, వడ పావ్ వంటి ఆహారాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ పిజ్జా, పాస్తా, బర్గర్లు వంటి అంతర్జాతీయ వంటకాలు కూడా భారతీయ స్ట్రీట్ ఫుడ్ లిస్టులోకి  ప్రవేశించాయి. 
 
ఇందులో భాగంగా కేఎఫ్‌సీ తరహా చికెన్‌ని విక్రయిస్తున్న వీధి వ్యాపారి వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. బోన్ లెస్ చికెన్ ముక్కలను మసాలా దినుసులలో కలపడం ఈ వీడియోలో చూడవచ్చు.