శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (10:36 IST)

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఆర్బీఐ గవర్నర్‌పై దాడికి యత్నం!

దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు తర్వాత తొలిసారి హస్తినను వీడి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు వచ్చిన భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక సుభాష్ చంద్ర

దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు తర్వాత తొలిసారి హస్తినను వీడి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు వచ్చిన భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై దాడి చేసేందుకు విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు యత్నించారు. 
 
పెద్దనోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వాస్తవ పరిస్థితులు వివరించేందుకు ఉర్జిత్ పటేల్ కోల్‌కతా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉర్జిత్ పటేల్‌పై కాంగ్రెస్ కార్యకర్తలుగా భావిస్తున్న పలువురు దాడికి యత్నించారు. నానా దుర్భాషలాడుతూ ఆయనపైకి దూసుకెళ్లారు. ఊహించని పరిణామంతో ఉర్జిత్ పటేల్ బిత్తరపోయారు. భద్రతా సిబ్బంది రంగప్రవేశం చేసి, ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. అనంతరం ఆయన మమతా బెనర్జీతో సమావేశమై వాస్తవ పరిస్థితిని వివరించారు