గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (12:06 IST)

కేంద్రం సూచన చేసింది.. మేం నిర్ణయం తీసుకున్నాం.. పెద్ద నోట్ల రద్దుపై ఆర్‌బీఐ నివేదిక

దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణాలను వివరిస్తూ భారత రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ఓ నివేదికను సిద్ధం చేసింది. ఇందులో పెద్ద నోట్ల రద్దుకు గల కారణాలను వివరించింది. కాంగ్రెస్ సీనియ

దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణాలను వివరిస్తూ భారత రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ఓ నివేదికను సిద్ధం చేసింది. ఇందులో పెద్ద నోట్ల రద్దుకు గల కారణాలను వివరించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయలీ సారథ్యంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి గ‌తనెల 22న‌ సమర్పించిన ఏడు పేజీల నివేదికను ఆర్బీఐ సమర్పించింది. ఇందులో పెద్ద నోట్ల రద్దుకు గల కారణాలను వివరిస్తూ పలు కీల‌క‌ విష‌యాల‌ను పేర్కొంది. ముఖ్యంగా తాము పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం కేవ‌లం ఒక్కరోజులో తీసుకున్నామని తెలిపింది. 
 
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సూచన‌లు చేసిన‌ మరుసటి రోజే తాము అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు పేర్కొంది. ఈ విష‌యంపై గ‌త ఏడాది నవంబర్‌ 7న త‌మ‌కు కేంద్ర స‌ర్కారు సూచించింద‌ని, నకిలీ నోట్లను అరిక‌ట్టేందుకు, తీవ్రవాదులను ఆర్థికంగా దెబ్బ‌తీసేందుకు, నల్లధనం రాబ‌ట్ట‌డానికి పాత‌ నోట్లను ఉపసంహరించుకోవాలని త‌మ‌ను కోరిన‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది. 
 
ఈ సమస్యలన్నింటినీ అధిగ‌మించేందుకు కేంద్రం సూచన చేసిన సూచ‌న‌ల మేర‌కు గ‌త ఏడాది నవంబర్ 8 ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు భేటీ అయి పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం తెలిపింద‌ని నివేదిక‌లో చెప్పింది. అనంత‌రం అదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న చేశార‌ని ఆర్‌బీఐ పేర్కొంది. ఇదిలావుండగా, పార్లమెంటరీ ప్రజాపద్దుల కమిటీ కూడా పెద్ద నోట్ల రద్దుపై వివరణ కోరింది. ఇందుకోసం ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు నోటీసులు కూడా జారీచేసింది.