సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 ఆగస్టు 2022 (22:38 IST)

ఈటీ మనీ- ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ పర్సనాలిటీ రిపోర్ట్‌ 2022

cash
భారతదేశంలో అతి పెద్ద మ్యూచువల్‌ ఫండ్స్‌ యాప్స్‌లో ఒకటి కావడంతో పాటుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఇన్వెస్ట్‌మెంట్‌ ఎడ్వైజరీ ప్లాట్‌ఫామ్‌ ఈటీమనీ ఇటీవలే తమ ప్రత్యేకమైన నివేదికను ‘ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ పర్సనాలిటీ రిపోర్ట్‌ 2022’ శీర్షికన విడుదల చేసింది. మదుపరుల వ్యక్తిత్వ విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికలో కీలకాంశాలను రూపొందించింది. ఇది మదుపరులను నాలుగు  కీలక ప్రమాణాలైనటువంటి రిస్క్‌ టోలరెన్స్‌, నష్టం స్వీకరించక పోవడం, ఆర్ధిక నైపుణ్యం, ఆత్మవిశ్వాస స్ధాయిలు పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా వారి వినూత్నమైన పెట్టుబడిదారి మనస్తత్వం ను మ్యాప్‌ చేస్తోంది.

 
ఈ విశ్లేషణ మదుపరులకు ఎనిమిది వినూత్నమైన వ్యక్తిత్వట్యాగ్‌లను అందించింది. ఈ నివేదిక వెల్లడించిన దాని ప్రకారం అధిక శాతం భారతీయ మదుపరులు స్ట్రాటజెజౖర్లు (35%). వీరు కాలిక్యులేటెడ్‌ రిస్క్‌ తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. వీరిని అనుసరించి ఎక్స్‌ప్లోరర్స్‌ (31%) మదుపరులు ఉంటారు. వీరు అధిక ఆత్మవిశ్వాసంతో రిస్క్‌ తీసుకుంటారు. ఇతర ఇన్వెస్టర్‌ పర్సనాలిటీలలో ప్రొటెక్టర్‌, ఎనలైజర్‌, సీకర్‌, ఎడ్వెంచరర్‌,రీసెర్చర్‌,అబ్జర్వర్‌లు మిగిలిన 34%కు తోడ్పాటునందిస్తారు.

 
ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం మహిళా మదుపరులు చక్కటి ప్రణాళికతో ఆర్గనైజ్డ్‌గా పెట్టుబడులు పెడుతున్నారు. స్ట్రాటజైజర్లు, రీసెర్చర్లు పురుషులతో పోలిస్తే వీరిలోనే అధికం. ఈ ప్రత్యేక నివేదిక గురించి ఈటీ మనీ ఫౌండర్‌- సీఈఓ ముకేష్‌ కల్రా మాట్లాడుతూ, ‘‘పెట్టుబడులలో మీరు చూపే పక్షపాతం మీ నగదు వృద్ధి చెందడంలోనూ కనిపిస్తుంది. ఈ పక్షపాతాలు పట్ల అవగాహన ఉంటే మీరు స్మార్ట్‌గా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలోనూ తోడ్పడుతుంది.

 
ఈటీమనీ ఇండియా ఇన్వెస్టర్‌ పర్సనాలిటీ రిపోర్ట్‌ 2022 మాకు వాస్తవ పరిస్థితులు గురించి  తెలుసుకునే అవకాశం అందించింది. భారతీయ మదుపరులు గుడ్డిగా రాబడుల వెంట పడుతున్నారు తప్ప వారి రిస్క్‌ టోలరెన్స్‌ చూడటం లేదు. ఆలోచనలలో స్పష్టత ఉంటే పెట్టుబడి  నిర్ణయాలు కూడా అంతే స్పష్టంగా ఉంటాయి. మేము ప్రారంభించిన ఈటీ మనీ జీనియస్‌ సభ్యత్వ సేవల ద్వారా పెట్టుబడిదారులకు వారి పెట్టుబడి లక్ష్యాలను అర్థం చేసుకునే అవకాశం అందిస్తున్నాము’’ అని అన్నారు.