గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 12 జులై 2021 (18:36 IST)

భారతదేశపు మొట్టమొదటి ఫావిపిరావిర్‌ ఓరల్‌ సస్పెన్షన్‌- ఫావెంజాను విడుదల చేసిన ఎఫ్‌డీసీ లిమిటెడ్‌

దేశీయంగా వృద్ధి చెందిన ఔషద సంస్థ ఎఫ్‌డీసీ లిమిటెడ్‌ నేడు భారతదేశపు మొట్టమొదటి ఓరల్‌ సస్పెన్షన్‌ ఫావిపిరావిర్‌-ఫావెంజా ఓరల్‌ సస్పెన్షన్‌‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. మోస్తరు నుంచి మధ్యస్తంగా ఉన్న కోవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులకు చికిత్సనందించడానికి దీనిని వినియోగించవచ్చు. డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ పైన మాత్రమే విక్రయించే ఈ సొల్యూషన్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రిటైల్‌ మెడికల్‌ ఔట్‌లెట్లు మరియు ఆస్పత్రి ప్రాంగణాలలోని ఔషద విక్రయశాలల్లో లభ్యమవుతుంది.
 
ఫావెంజా సస్పెన్షన్‌, వినూత్నమైనది. ఎందుకంటే, దీని యొక్క సౌకర్యవంతమైన లోడింగ్‌ డోస్‌(మొదటి రోజు) 18 మిల్లీ లీటర్లు ఉదయం మరియు 18 మిల్లీ లీటర్లను సాయంత్రం వాడవలసి ఉంటుంది. ఈ ఫలితాలు ఫావిపిరావిర్‌ 400 మిల్లీగ్రాముల 9 మాత్రల వినియోగానికి సమానంగా ఉంటుంది. తద్వారా కోవిడ్‌-19 చికిత్స సౌకర్యవంతంగా మారుతుంది.
 
శ్రీ మయాంక్‌ టిక్కా, జనరల్‌ మేనేజర్- బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కమర్షియల్‌ ఎక్స్‌లెన్స్‌, ఎఫ్‌డీసీ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘మరోమారు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో, ఈ మహమ్మారితో చేస్తోన్న యుద్ధంలో దేశంలోని మన హెల్త్‌కేర్‌ వారియర్లుకు అనుకూలమైన అవకాశాలను అందించాల్సిన ఆవశ్యకత ఉంది. కోవిడ్-19తో పోరాడేందుకు, అత్యుత్తమ సమర్థతతో పాటుగా సౌకర్యాన్నీ మన రోగులకు అందించాల్సిన అవసరముందని మేము నమ్ముతున్నాం మరియు కోవిడ్‌-19 చికిత్సను సౌకర్యవంతంగా తీర్చిదిద్దడంపై మేము దృష్టి సారించాము’’ అని అన్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కోవిడ్‌ కేసులు నమోదైన రెండవ దేశం ఇండియా. ప్రతిరోజూ ఇక్కడ దాదాపు 50వేల కేసులు నమోదవుతున్నాయి. సెకండ్‌ వేవ్‌కు సంబంధించి కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, ఇది ముగియలేదు మరియు మూడోవేవ్‌ వస్తుందనే భయాలూ ఉన్నాయి.