శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (08:27 IST)

ఒక్కసారిగా పెరిగిన ప్రయాణికుల రద్దీ - చార్జీల్లో 3 రెట్లు పెంపుదల

దేశంలో పండగ సీజన్ మొదలైంది. ముఖ్యంగా, క్రిస్మస్, కొత్త సంపత్సరం, సంక్రాంతి పండగలు వరుసగా రానున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ సొంతూళ్లకు వెళ్లేందుకు క్యూకడుతున్నారు. ఈ కారణంగా విమానాశ్రయాల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతూ ప్రయాణ చార్జీలను పెంచేస్తున్నాయి. 
 
ముఖ్యంగా, దక్షిణాదిలో ఈ ప్రయాణం చార్జీలను విమానయాన సంస్థలు అమాంతం పెంచేశాయి. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు, తూత్తుకుడి ప్రాంతాలకు వెళ్లే విమానాల్లో రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణ చార్జీలను కూడా మూడు రెట్లు పెరిగింది. గతంలో వెబ్‌సైట్లలో ఉన్న ధరలతో పోల్చితే ఆ సంస్థలు వసూలు చేస్తున్న ప్రయాణ చార్జీలు అధికంగా ఉన్నాయి. 
 
చెన్నై తూత్తుకుడిల మధ్య ప్రయాణ చార్జీ గతంలో రూ.3,500గా ఉంటే ప్రస్తుతం ఈ టిక్కెట్ ధర రూ.10,500 నుంచి రూ.12 వేలకు చేరింది. అలలాగే, చెన్నై నుంచి తిరువనంతపురానికి రూ.4 వేలు చార్జీ ఉండగా, ఇపుడు ఇది రూ.9 వేలకు చేరింది. చెన్నై నుంచి కొచ్చిన్‌కు రూ.3500 ఉండగా, ఇపుడు ఇది రూ.9500కు పంచేశారు.