సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (11:07 IST)

లాక్ డౌన్.. అమేజాన్, ఫ్లిఫ్ కార్ట్ బంద్-ఏప్రిల్ 10 తర్వాతే డెలివరీ

కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి వల్ల లాక్ డౌన్ ప్రభావం ఈ కామర్స్ వెబ్ సైట్లపై పడింది. ఇందులో భాగంగా ఈ-కామర్స్ వెబ్ సైట్ అయిన ప్లిప్‌కార్ట్ తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
 
మరో ఆన్‌లైన్ వెబ్ సైట్ అయిన అమేజాన్ నిత్యావసరేతర వస్తువుల పంపిణీని ఆపేసింది. దేశంలో లాక్ డౌన్ సందర్భంగా తాము వినియోగదారులకు నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రాధాన్యమిస్తామని అమేజాన్ ప్రకటించింది.
 
నిత్యావసర వస్తువులను వినియోగదారులకు అందించేందుకు తాము ప్రాధాన్యమిస్తామని అమేజాన్ ఇండియా వివరించింది. కాగా అమేజాన్ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో వినియోగదారులు బుధవారం సరకులను ఆర్డరు చేస్తే డెలివరీ ఏప్రిల్ నెల 10వ తేదీ తర్వాత చేస్తామని చెప్తున్నారు.