శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (22:44 IST)

కరోనా వైరస్, 21 రోజుల పాటు దేశం లాక్ డౌన్, ఏమేమి పని చేస్తాయి?

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రధాని మోదీ 21 రోజుల పాటు లాక్ డౌన్ పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఐతే ఈ 21 రోజుల పాటు నిత్యావసర వస్తువుల మాటేమిటి అని చాలామంది ఆందోళనపడి వుంటారు. ఐతే నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆటంకం వుండబోదు. 
 
రేషన్ షాపులు, పండ్లు, కూరగాయలు, పాలు, డెయిరీ షాపులు, బ్యాంకులు, ఏటీఎంలు, మందుల షాపులు తెరిచే వుంటాయి. అలాగే విద్యుత్, నీటి సరఫరా, శానిటరీ విభాగాలు పనిచేస్తాయి. 
అలాగే పెట్రోలు బంకులు, నిత్యావసరానికి అవసరమైన ఉత్పత్తులను తయారుచేసే తయారీ సంస్థలు పనిచేస్తాయి. నిత్యావసర వస్తువులు, సేవలకు మాత్రమే రవాణా సౌకర్యం చేసుకునే అవకాశం వుంటుంది.