బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (10:58 IST)

పెరుగుతున్న వెండిధరలు.. మహిళలకు షాక్

దేశంలో బంగారం, వెండి ఆభరణాల పట్ల మక్కువ ఎక్కవ ముఖ్యంగా, మహిళలు బంగారం ఆభరణాల కొనుగోలుకు విపరీతంగా ఇష్టపడుతారు. ఈ కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. అయితే, గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మరోమారు పెరిగాయి. అలాగే, వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. దేశీయంగా వెండి ధర రూ.100 పెరిగిరూ.61300గా చేరుకుంది. అలాగే, బంగారం ధరల్లో కూడా మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుదం బంగారం ధరల్లో మార్పు ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం. 
 
దేశ రాజధాని ఢిల్లీలో రూ.61,300గా ఉంటే, ముంబైలో కిలో వెండి ధర రూ.61300గా వుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.65400గా ఉంటే, కోల్‌కతాలో రూ.61300గా వుంది. ఇకపోతే బెంగుళూరులో ఈధర రూ.65400గా వుంటే, కేరళలో రూ.64400గా వుంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంలో రూ.65400గాను, విజయవాడలో రూ.65400గాను, విశాఖలో రూ.65400గాను ఉంది.