గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (11:16 IST)

బంగారం కొనేవారికి షాకింగ్ న్యూస్.. పెరిగిన ధరలు

బంగారం కొనేవారికి షాకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే బంగార ధర వరుసగా మూడో రోజు పుంజుకుంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. 
 
తాజాగా హైదరాబాద్‌‌లో రూ.100 మేర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,650 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,800గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.500 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,300 అయింది.
 
ఏపీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర శనివారం రూ.45,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 
 
వెండి 1 కిలోగ్రాము ధర రూ.69,300కు ఎగబాకింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.