బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (14:47 IST)

2021 డిసెంబరులో రూ.35,000 కోట్ల విలువ చేసే బంగారం దిగుమతి

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలకు పసిడి ప్రియులు. దీంతో భారీగా బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. దీంతో బంగారం డిమాండ్‌కు మన దేశంలో భలే గిరాకీ ఉంది. ఫలితంగా గత 2021లో ఏకంగా 35 వేల కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. 
 
గత 2021లో డిసెంబరు నెలలో 4.8 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. గత 2020 డిసెంబరు నెలలో ఇది 4.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే 2021తో పోల్చితే ఇది స్వల్పంగా పెరిగింది. 
 
ఇకపోతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 ఏప్రిల్ నుంచి డిసెంబరు నెల వరకు తొమ్మిది నెలల కాలంలో 38 బిలియన్ డాలర్ల విలువ పసిడి దిగుమతులు నమోదైనట్టు తెలిపింది. 
 
కానీ, 2020 ఏప్రిల్ - డిసెంబరు కాలంలో ఇది 16.78 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. అంటే 2021 సంవత్సరంలో బంగారం దిగుమతులు రెట్టింపు అయ్యిందన్నమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాలంలో పసిడి దిగుమతులు పెరిగినందున వాణిజ్య లోటు 142 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది.