బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (20:53 IST)

రూ.21 కోట్ల విలువైన 43కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం

బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో రూ.21 కోట్ల విలువైన 43 కిలోల బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
ఇంఫాల్ నగరంలో అధికారులు తనిఖీ చేస్తుండగా ఓ కారును ఆపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అధికారుల్లో కారులో తనిఖీ చేపట్టారు. బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకోని కారును క్షున్నంగా పరిశీలించారు.
 
కారులోని వేరు వేరు ప్రదేశాల్లో 260 బంగారు బిస్కెట్లను కుక్కారు. వీటన్నింటికి బయటకు తీసేందుకు పోలీసులకు 18 గంటల సమయం పట్టింది. కాగా కారులోంచి బయటకు తీసిన బంగారం బరువు 43 కిలోలు ఉండగా.. దాని మార్కెట్ విలువ రూ.21 కోట్లు. గతంలో కూడా కొన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఈ కారును ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.