బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (19:39 IST)

ఏపీలో ప్రభుత్వ ఎక్సైజ్ షాపుల్లో భారీగా మోసాలు

ఏపీలో ప్రభుత్వ ఎక్సైజ్ షాపుల్లో భారీగా మోసాలు జరుగుతున్నాయని వార్తలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేశారు ఎక్సైజ్ అధికారులు. చిత్తూరులో ఉన్న 270కి పైగా మద్యం షాపుల్లో అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాదిరూపాయలు వైన్ షాపుల్లో గోల్ మాల్ జరుగుతూ వస్తోందని అధికారులు గుర్తించారు.
 
చిత్తూరు జిల్లాల్లో 15 కేసులు వెలుగులోకి వస్తే.. 6 కేసులు మాత్రమె నమోదు చేశారు. ప్రభుత్వ లెక్కల్లో లేకుండా దాదాపు 24 లక్షల రూపాయల మద్యం అమ్మాకాలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. గంగాధర నేల్లోరులోని నర్సాపురం మద్యం షాపులో 2.15 లక్షల అక్రమాలు చోటుచేసుకున్నాయి. కాణిపాకం ప్రభుత్వ మద్యం షాపులో 8 లక్షల రూపాయల అక్రమ అమ్మకాలు జరిగాయి.
 
అయితే, ఇప్పుడు జరిగిన సోదాల్లో తేలిన అక్రమాలతో తమకు సంబంధం లేదని ఎక్సైజ్ సిబ్బంది తప్పించుకుంటూ.. తప్పంతా అవుట్ సోర్సింగ్ సిబ్బందిపైకి నెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
 
మరోసారి టీవీ9 అక్రమాలపై తనదైన విధానంలో ప్రభుత్వాన్ని మేలుకొలిపింది. దీంతో నిత్యం ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో జరుగుతున్న అక్రమాల్లో చేతులు మారిపోతున్న కోట్లాదిరూపాయల సొమ్ము విషయం ప్రభుత్వానికి తెలిసివచ్చింది. ఈ అక్రమాలపై ఉక్కుపాదం మోపే అవకాశం చిక్కింది.