సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2016 (10:14 IST)

అక్రమ బంగారంపై ఉక్కుపాదం.. వివాహిత స్త్రీలు 500 గ్రాములు-పురుషులు 100గ్రాములు..

పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు చెక్ పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ.. అక్రమంగా బంగారాన్ని దాచుకున్న వారిపై కూడా కొరడా ఝళిపించారు. అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బుతో కొనుగోలు చేసిన‌ బంగారంపై ప‌న్ను విధించే

పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు చెక్ పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ.. అక్రమంగా బంగారాన్ని దాచుకున్న వారిపై కూడా కొరడా ఝళిపించారు. అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బుతో కొనుగోలు చేసిన‌ బంగారంపై ప‌న్ను విధించే నేప‌థ్యంలో తాము తీసుకోనున్న చ‌ర్య‌ల్లో భాగంగా కొన్ని విష‌యాల‌పై కేంద్ర ఆర్థిక‌ శాఖ స్పష్టత ఇచ్చింది. కొత్తగా తీసుకొస్తోన్న చ‌ట్టంలో పొందుపొరుస్తున్న అంశాల గురించి వివ‌ర‌ణ ఇచ్చింది.
 
దేశంలో వివాహిత 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాముల బంగారం కలిగివుండవచ్చునని స్పష్టం చేసింది. ఇక పురుషులు 100 గ్రాముల బంగారం క‌లిగి ఉండ‌వ‌చ్చని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. వార‌స‌త్వంగా వ‌చ్చిన‌, లెక్క‌చూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై ఎటువంటి ప‌న్నులు ఉండబోవ‌ని స్ప‌ష్టం చేసింది. 
 
కాగా.. ఆర్థిక‌శాఖ తెలిపిన వివ‌రాలపై కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి వెంక‌య్య‌నాయుడు స్పందించారు. త‌మ ప్ర‌భుత్వం నల్లకుబేరుల వ‌ద్ద ఉన్న డ‌బ్బు, బంగారంపై ఉక్కుపాదం మోపిందని వ్యాఖ్యానించారు. ర‌ద్దైన నోట్ల‌తో బంగారం కొని నిల్వ చేసుకునే వారి ఆగ‌డాల‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం చట్టంలో ప‌లు మార్పులు చేసింద‌ని పేర్కొన్నారు. 
 
బంగారాన్ని న‌ల్ల‌ధ‌నంతో కాకుండా స‌క్ర‌మంగా కొనుకున్న వారికి ఎటువంటి ఇబ్బందులూ ఉండ‌బోవ‌ని వెంకయ్య స్పష్టం చేశారు. వారసత్వం, స్త్రీధనంగా వచ్చిన బంగారంపై నిబంధ‌న‌లు ఉండవని.. న‌ల్ల‌కుబేరులు లెక్కచూపని బంగారంపైనే 75 శాతం పన్ను ఉంటుందని వెంకయ్య క్లారిటీ ఇచ్చారు.